ఈ గణపయ్యను చూడాలంటే అగ్నిపర్వతం ఎక్కాల్సిందే..

by Sumithra |   ( Updated:2024-01-14 16:30:54.0  )
ఈ గణపయ్యను చూడాలంటే అగ్నిపర్వతం ఎక్కాల్సిందే..
X

దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నాయి. జనావాసాల్లో, కొండల్లో, అడవుల్లోనూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఓ గణపయ్య విగ్రహం మాత్రం ఏకంగా అగ్నిపర్వతం ముఖద్వారం దగ్గరే ఉంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంతకీ ఏ అగ్నిపర్వతం ముఖద్వారం దగ్గర వినాయకుడు వెలిశాడు, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

700 సంవత్సరాల నాటి వినాయకుని విగ్రహం

ఇండోనేషియాలో సుమారు 141 అగ్నిపర్వతాలు ఉన్నాయి. కాగా వీటిలో 130 పర్వతాలు ఇప్పటికీ పొగలుగక్కుతూ ఉంటాయి. ఈ 130 పర్వతాల్లోనే ఒక పర్వతమైన బ్రోమో అనే అగ్ని పర్వతం పై 700 సంవత్సరాల నాటి వినాయక విగ్రహం ఉంది. ఈ బ్రోమో పర్వతాన్ని పవిత్రంగా పరిగణిస్తారు.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి ?

ఇండోనేషియాలోని అగ్నిపర్వత ముఖద్వారం వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని చూడాలనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి ముందుగా సురబయ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. ఇక్కడి నుండి బస్సులో బస్ టెర్మినల్‌లో దిగాలి. అక్కడి నుంచి వినాయకుని దగ్గరికి చేరుకోవచ్చు. సూర్యోదయ సమయంలో ఇక్కడ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది.

ఇండోనేషియాలో భారతీయ సంస్కృతి..

ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ భారతీయ సంస్కృతిని చూడవచ్చు. ఇండోనేషియాలో పురాతన సరస్వతి ఆలయం, తనహ్ లాట్ ఆలయం, పుర బెస్కియా ఆలయం, సింఘసరి శివాలయం, ప్రంబనన్ ఆలయం వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇండోనేషియా కరెన్సీ పై వినాయకుడి ఫోటో కూడా ముద్రిస్తారు.

Advertisement

Next Story