గుడ్లగూబ ఫోటోలు, బొమ్మలు ఇంట్లో ఉంచడం శుభమా, అశుభమా ?

by Sumithra |
గుడ్లగూబ ఫోటోలు, బొమ్మలు ఇంట్లో ఉంచడం శుభమా, అశుభమా ?
X

దిశ, ఫీచర్స్ : మీరు మీ ఇంట్లో లేదా కార్యాలయంలో వాస్తు ప్రకారం కొన్నివస్తువులను పెడితే, అది మీ ఇంటికి, వ్యాపారానికి మంచి జరుగుతుందని అనుకుంటారు. అయితే గుడ్లగూబ బొమ్మను లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వలన మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ దేవుళ్ళలో ప్రతి ఒక్క దేవునికి ఒక వాహనం ఉంటుంది. ఈ వాహనాల్లో జంతువులు, పక్షులు ఉంటాయి. ఎలుక గణేశుడి వాహనం, సింహం దుర్గా మాత వాహనం, నంది శివుని వాహనం ఇలా ఒక్కో దేవునికి ఒక వాహనం ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. అయితే కొంతమంది గుడ్లగూబను శుభప్రదంగా భావిస్తారు, మరికొందరు దానిని అశుభంగా భావిస్తారు, కానీ వాస్తు శాస్త్రంలో గుడ్లగూబను శుభానికి చిహ్నంగా భావిస్తున్నారు. అందుకే కొంతమంది తమ కార్యాలయంలో లేదా ఇంట్లో గుడ్లగూబ చిత్రాన్ని ఉంచుతారు. కొంతమంది గుడ్లగూబ విగ్రహం లేదా బొమ్మను ఉంచడం శ్రేయస్కరం కాదు అని అనుకుంటారు.

గుడ్లగూబ చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా?

గుడ్లగూబలు వివిధ మతాలలో లేదా విభిన్న నాగరికతలలో, సంస్కృతులలో విభిన్న నమ్మకాలను కలిగి ఉంటాయి. జపాన్, అమెరికా, పాశ్చాత్య సంస్కృతిలో గుడ్లగూబను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ పక్షి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని, భవిష్యత్తులో జరిగే ప్రమాదాల గురించిన సమాచారం ఇస్తుందని చెబుతున్నారు. రోమన్ నాగరికతలో, జపాన్‌లోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

గుడ్లగూబల చిత్రాలు, విగ్రహాలను ఉంచడం వల్ల లక్ష్మీ దేవి సంతోషించి ఆమె ఆశీర్వాదాలు ఇస్తుందని చెబుతారు. అలాగే, వాస్తు దోషాలను తొలగించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతారు. స్టడీ టేబుల్‌పై లేదా ఆఫీసులో గుడ్లగూబ చిత్రాన్ని ఉంచితే, ఖచ్చితంగా సంపదను పొందుతారని నమ్ముతారు.

గుడ్లగూబ చిత్రాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుడ్లగూబ బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబానికి ఐశ్వర్యంతో పాటు ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్ముతారు. అయితే దానిని సరైన దిశలో, నియమాల ప్రకారం ఉంచినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆఫీసులో లేదా ఇంట్లో గుడ్లగూబను ఉంచితే నరదృష్టి తొలగిపోతుందని చెబుతారు. గుడ్లగూబను ఇంట్లో అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచడం, గుడ్లగూబ ముఖాన్ని ఇంటి ప్రధాన ద్వారం వైపు పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో గుడ్లగూబ చిత్రాన్ని ఎలా ఉంచాలి?

కార్యాలయంలో గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచితే లక్ష్మి దేవి ఆశీర్వాదాన్ని తెస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, గుడ్లగూబను కార్యాలయంలో పనిచేసే ప్రదేశంలో కుడి వైపున పెడితే మంచిదని చెబుతారు. ఇది మీ పనిలో వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తుందట.

Advertisement

Next Story

Most Viewed