Koti Somavaram: రేపు కోటి సోమవారం.. దీపారాధన చేస్తే కలిగే ఫలితాలేంటో తెలుసా ?

by Rani Yarlagadda |
Koti Somavaram: రేపు కోటి సోమవారం.. దీపారాధన చేస్తే కలిగే ఫలితాలేంటో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్: జనవరి, ఫిబ్రవరి, మార్చి..ఇలా 12 ఇంగ్లీషు నెలలు ఉన్నట్లే.. హిందూ పురాణాల ప్రకారం 12 తెలుగు నెలలు కూడా ఉంటాయి. ఉగాది పండుగతో తెలుగు క్యాలెండర్ (Telugu Calendar) ప్రారంభమవుతుందో. తెలుగు నెలల ప్రకారం 8వ నెల కార్తీకం. ఈ కార్తీకమాసంలో హరిహరులను పూజిస్తే.. ఎంతో పుణ్యమని, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. హరి స్థితికారుడైతే.. హరుడు శుభంకరుడు. వీరిద్దరినీ ఈ పవిత్రమైన కార్తీకమాసంలో పూజిస్తే.. ప్రతీ పని శుభాలనిస్తుందని నమ్ముతారు. స్నానం, దీపం, ధూపం, దానం, అభిషేకం, ఉపవాసం వంటివి.. విశేషమైన ఫలితాలనిస్తాయి. కొందరు ఈ మాసమంతా చన్నీటి స్నానం, ఒంటిపూట భోజనం, నేలపడక వంటివి ఆచరిస్తారు.

దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా. దీపానికి ఆధారం బ్రహ్మ.. ఆ దీపంలో వేసే ఒత్తిని ఈశ్వర స్వపూరంగా భావిస్తారు. అందులో వేసే ఆవునెయ్యి లేదా నూనెను విష్ణు స్వరూపమని చెబుతారు. త్రిమూర్తులు ఈ దీపంలో ఉంటారు. అంతటి శక్తి కలిగిన దీపాన్ని వెలిగించే శక్తి సుబ్రహ్మణ్యుడికే ఉంటుంది. అందుకే ఆయన్ను కార్తికేయుడు అంటారు. కృత్తిక నక్షత్రంలో జన్మించిన ఆయన్ను నక్షత్ర రూపంలో దర్శనం చేసుకుని.. స్నానం ఆచరిస్తే ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారని శివ మహాపురాణం చెబుతోంది.

కార్తీకమాసంలో శ్రవణ నక్షత్రంతో (Sravana Nakshatram) కలిసి వచ్చే శనివారాన్ని కోటి సోమవారంగా పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 9న కోటి సోమవారం (Koti Somavaram) వచ్చింది. శనివారం ఉదయం 8.43 గంటల వరకూ శ్రవణా నక్షత్రం ఉంది. ఇది వెంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం. ఇలాంటి కలయిక ఉన్న రోజు చాలా అరుదుగా వస్తుంది. ఈ రోజున ఉదయాన్నే దీపారాధన చేస్తే.. తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల వచ్చిన పాపం పోతుందని, కోటి లింగాలను పూజించిన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే చాతుర్మాస్య దీక్ష చేసిన వారు.. క్షీరాబ్ది ద్వాదశి (నవంబర్ 13) ఉసిరి దీపం వెలిగిస్తే చాలా పుణ్యమని పురోహితులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed