- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాఘ పూర్ణిమ రోజు ఇలా చేస్తే.. మీ కోరికలు నెరవేరతాయి..
దిశ, ఫీచర్స్: హిందూ మతంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. అలాగే పౌర్ణమికి, అమావాస్యకు ప్రత్యేక విశిష్టత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ పౌర్ణమి సమయంలో స్నానం, దానానికి ప్రత్యేక అర్థం ఉంది. మరి ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం..
మాఘ పూర్ణిమ ఎప్పుడు?
పూర్ణిమ తిథి ఫిబ్రవరి 23న ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:33 నుండి ప్రారంభమై.. ఫిబ్రవరి 24 సాయంత్రం 5.59 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకోనున్నారు.
మాఘ పూర్ణిమ శుభ ముహూర్తం
అభిజిత్ ముహూర్తం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 24న అర్ధ రాత్రి 12:12 నుండి మధ్యాహ్నం 12:57 వరకు జరుగుతుంది. ఈ సమయంలో స్నానం, దానం చేయడం, పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత
మాఘ పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగాస్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తే, చాలా మంచిది. పాపాలు పోగొట్టుకోవడానికి మాఘ పూర్ణిమ నాడు స్నానం చేసి దానం చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.