Flowers: పూజకు పూలనే ఎందుకు వాడతారో తెలుసా?

by Prasanna |
Flowers: పూజకు పూలనే ఎందుకు వాడతారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మనం గుడికి వెళ్ళేటప్పుడు పూజ సామాగ్రి తీసుకెళ్తుంటాము. పూజ సామాగ్రి పుష్పలాది ప్రత్యేక స్థానం ఉంది. పూజ చేసే సమయంలో పుష్పాలను పెట్టడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా ఉంది. అయితే ఈ పుష్పాలను ఖచ్చితంగా ఎందుకు వినియోగించాలా ? వాటి వల్ల కలిగే ప్రయోనాజాలు ఏంటనేది చాలా మందికి తెలిసి ఉండదు. భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్ని కానీ పండును కానీ జలాన్ని కానీ ఎవరు సమర్పిస్తారో అలాంటి వారి భక్తితో పెట్టే నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీ కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన మనస్సుతో పూజిస్తారో..అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది.

దేవునుకు పెట్టె పుష్పం ఏదైనా సుచి, శుభ్రదతతో కూడుకున్నదై ఉండాలి. పురిటి వారు, మైల వారయిన మహిళలు పుష్పాలను తాకరాదు. అలాంటి పూలు పూజకి పనికి రావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలను పూజకి వాడకూడదు. స్నానం చేసిన తర్వాత కోసిన పూలను మాత్రమే దేవుడుకు పెట్టాలి. పూలతో పూజిస్తే మనసులో ఉన్న కోరికలు నేరతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed