లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా ?

by Sumithra |
లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా ?
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం రెండింటిలోనూ తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాబేలును విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది. విష్ణుమూర్తి కూర్మావతారంలో ఎత్తినప్పుడు లక్ష్మిదేవి విష్ణువుతో నివసిస్తుంది. అందుకే తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి కూడా నివసిస్తుందని పండితులు చెబుతున్నారు. తాబేలు లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనదిగా పరిగణిస్తారు. అయితే నిజం తాబేలును ఇంట్లో ఉంచడం కష్టం కాబట్టి మీరు లోహంతో చేసిన తాబేలును తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటారు. అయితే లోహంతో చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కోరికలు తీరుతాయి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోహంతో చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకుంటే మీ కోరికలు తీరతాయని పండితులు చెబుతున్నారు. తీరని కోరిక ఏదైనా ఉంటే అప్పుడు మీరు తెల్ల కాగితం తీసుకుని ఆ కాగితం పై ఎరుపు రంగు పెన్నుతో మీ కోరికను రాయాలి. ఆ తర్వాత ఈ కాగితాన్ని లోహంతో తయారు చేసిన తాబేలు కింద పెట్టి దాన్ని ఉత్తర దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కోరిక త్వరలో నెరవేరుతాయని చెబుతున్నారు.

డబ్బు సమస్యలు తొలగిపోతాయి..

డబ్బుకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టయితే ఇంట్లో స్ఫటిక తాబేలు పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను దూరం చేసి ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుందని నమ్ముతారు.

చదువులో ఏకాగ్రత..

వాస్తు ప్రకారం, విద్యార్థులకు చదువు పై ఆసక్తి లేకుంటే, చదువుకునే సమయంలో వారి మనస్సు అక్కడక్కడ తిరుగుతుంది. అలాంటప్పుడు విద్యార్థుల స్టడీ టేబుల్‌ పై ఇత్తడి లోహంతో చేసిన తాబేలును పెట్టాలి. ఇత్తడితో తయారు చేసిన తాబేలును స్టడీ టేబుల్‌ పై ఉంచడం వల్ల విద్యార్థుల మనసు చదువుపైనే కేంద్రీకరిస్తుందని చెబుతున్నారు. ఈ పరిహారం దృష్టి లోపాల నుండి కూడా రక్షిస్తుందట.

సంపదలో స్థిరత్వం..

మీరు కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే, మీ దుకాణం, కార్యాలయంలో వెండి లోహంతో చేసిన తాబేలును ఉంచండి. ఇలా చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఆకర్షితులై సంపద స్థిరంగా ఉంటుందని నమ్ముతారు.

తాబేలు అదృష్ట ఉంగరం..

లోహంతో చేసిన తాబేలు ఉంగరాన్ని కూడా చాలా మంది ధరిస్తూ ఉన్నారు. ఈ ఉంగరం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఉంగరాన్ని శుక్రవారం లేదా అక్షయ తృతీయ, ధంతేరస్ లేదా దీపావళి లేదా పవిత్రమైన రోజులలో ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారట.

Advertisement

Next Story