పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారు.. కారణం ఏంటో తెలుసా..

by Sumithra |   ( Updated:2024-04-29 12:58:00.0  )
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారు.. కారణం ఏంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : భారతీయ వివాహ వేడుకల్లో అనేక సంప్రదాయాలు, ఆచారాలు, ఎన్నో పద్దతులు ఉంటాయి. ఒక్కో ఆచారం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇదిలా ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్దతిలో వివాహ వేడుకలను జరుపుతుంటారు. ఎన్ని పద్దతుల్లో పెళ్లి జరిపినా నూతన వధూవరులకు పసుపు పూసే ఆచారం మాత్రం అనాదిగా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ పసుపు పూసే వేడుకను ఎంతో అట్టహాసంగా హల్దీ ఫంక్షన్ అంటూ జరుపుకుంటున్నారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదంటున్నారు పండితులు. పసుపు పూయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పసుపులో ఉండే అనేక ఔషధ గుణాలు చర్మం మెరిసేలా చేస్తుంది. అంతే కాదు వధూవరుల అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే పసుపు పూయడం వెనక ఉండే మరిన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ మహావిష్ణువును, లోకనాధుడు, లోకరక్షకుడు అని పిలుస్తారు. ఆయనను ఆరాధించే సమయంలో పసుపునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే వధూవరులను విష్ణుమూర్తి, లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే వివాహ వేడుకలో ముందుగా వధూవరులకు పసుపు పూసేవేడుకను శుభప్రదంగా భావిస్తారు. అలాగే వధూవరుల పై చెడు కళ్ళ నుంచి రక్షించడానికి పసుపును పూస్తారు.

పసుపు పూసే ప్రాముఖ్యత..

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి వివాహాలకు బాధ్యత వహించే గ్రహంగా భావిస్తారు. అయితే పెళ్లికి ముందు పసుపును పూయడం వలన వారి వైవాహిక జీవితం జీవితాంతం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. అలాగే పసుపు పూస్తే ప్రతికూల శక్తులు కూడా దూరంగా ఉంటాయని చెబుతారు. అలాగే పసుపు రంగు వారి జీవితంలో శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది.

శాస్త్రీయ కారణాలు..

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పసుపులో ఉంటాయి. దీని ద్వారా ఇన్ఫెక్షన్లు కూడా దరిచేయవు. పసుపు ఆందోళనలని, మానసిక ఒత్తిడిని, అలసటను దూరం చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed