అమావాస్య రోజున ఈ పనులు చేయొద్దు.. దరిద్ర దేవత తిష్టవేస్తుంది

by Prasanna |
అమావాస్య రోజున ఈ పనులు చేయొద్దు.. దరిద్ర దేవత తిష్టవేస్తుంది
X

దిశ, ఫీచర్స్: వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈ రోజు ఏ పని చేసిన మీ పూర్తి శ్రద్ధ చాలా అవసరం. అప్పుడే దరిద్ర దేవత నుండి తప్పించుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలం. అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేదరికం నుండి బయటపడటానికి సానుకూల ఫలితాలను సాధించగల ఏకైక మార్గం ఇది. అమావాస్య రోజు సూర్యోదయం వరకు నిద్రిస్తే దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి సూర్యోదయానికి ముందే మేల్కొనండి. ఈ రోజున తల స్నానం చేయకూడదు. అలాగే కొత్త బట్టలను ధరించకూడదు.

అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో తలకు నూనె రాసుకోవడం కూడా మంచిది కాదు. పేదరికానికి దారి తీస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. కావున లక్ష్మీపూజ చేయండి. పితృదేవతలను నమస్కరించి వారి ఆశీస్సులు కోరాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్రాల ప్రకారం, ఈ రోజున ఎటువంటి కొత్త పనులను, శుభ కార్యాలు చేయకూడదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు వాస్తుశాస్త్ర నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed