MerryChristmas: క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

by GSrikanth |   ( Updated:2022-12-25 03:04:55.0  )
MerryChristmas: క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు జరుపుకునే పండుగ క్రిస్మస్. ఏసు క్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్మస్ వేడకులను జరుపుకుంటారు. చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెబుతారు. రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతేకాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు' అని దేవదూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారని చెబుతారు. జీసస్ పుట్టినప్పటి నుండి కరుణామయుడిగా.. దయామయుడిగా క్రైస్తవులందరి ఆరాధానలను అందుకుంటున్నాడు.

Also Read..

Christmas: క్రిస్మస్ చెట్టు వెనకున్న కథలేంటో తెలుసా?

Advertisement

Next Story