- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బద్రీనాథ్ దర్శనానికి వెళుతున్నారా.. ఈ అందమైన ప్రదేశాలను కూడా సందర్శించండి..
దిశ, ఫీచర్స్ : మే 12న ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమయ్యింది. దీనికి ముందు కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలు ప్రారంభమయ్యాయి. చార్ ధామ్ యాత్రను ప్లాన్ చేసుకునే వారు ఆ ప్రాంతంలోని మరిన్ని అందమైన దృశ్యాలను కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. మరి బద్రీనాథ్ తో పాటు సందర్శించేందుకు అనువైన పర్యాటక ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీలకంఠ శిఖరం..
ఇది ఉత్తరాఖండ్‌లోని పురాతన శిఖరాలలో ఒకటి. ఇక్కడ అనేక అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. నీలకంఠ శిఖరం ట్రెక్కింగ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. బద్రీనాథ్ సందర్శించే వారు నీలకంఠ శిఖరాన్ని కూడా సందర్శించవచ్చు.
చరణ్ పాదుకా
బద్రీనాథ్‌లో చరణ్ పాదుకా పర్వతం కూడా ఉంది. దీని దూరం బద్రీనాథ్ నగరానికి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ విష్ణుమూర్తి పాదముద్రలు చూడవచ్చు. ఇక్కడ శిలాఖండ్ అనే మతపరమైన ప్రదేశం కూడా ఉంది. దీనికి సంబంధించిన అనేక పురాణ కథనాలు ఉన్నాయి.
వసుధార జలపాతం
బద్రీనాథ్‌లో వసుధార జలపాతం కూడా అందమైన పర్యాటక ప్రదేశం. ఈ జలపాతం ఎత్తు దాదాపు 12 వేల అడుగులు. ఈ ప్రదేశంలో పాండవులు విశ్రాంతి తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. కానీ వసుధార జలపాతం చేరుకోవాలంటే 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. బద్రీనాథ్ నుంచి ఈ గ్రామానికి టాక్సీ అందుబాటులో ఉంటుంది.
బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి..
మీరు బద్రీనాథ్ వెళ్లాలని అనుకుంటే రిషికేశ్, హరిద్వార్ లేదా డెహ్రాడూన్‌కి రైలులో వెళ్ళవచ్చు. ఈ ప్రదేశాల నుండి మీరు స్థానిక టాక్సీ లేదా బస్సులో బద్రీనాథ్ వెళ్ళవచ్చు. విమానంలో వెళ్లాలనుకుంటే జాలీ గ్రాంట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి టాక్సీలో ఇక్కడకు చేరుకోవచ్చు.