ఈ రోజు కామద ఏకాదశి.. ఇలా చేస్తే పెళ్లి కుదిరే అవకాశం ఉందన్న జ్యోతిష్య నిపుణులు

by Prasanna |
ఈ రోజు కామద ఏకాదశి..  ఇలా చేస్తే పెళ్లి కుదిరే అవకాశం ఉందన్న జ్యోతిష్య నిపుణులు
X

దిశ, ఫీచర్స్: కామద ఏకాదశి.. పేరులోనే కామద ఉంది.. అంటే విష్ణువు మన కోరికలన్నిటినీ తీరుస్తాడు. అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని కూడా పండితులు చెబుతున్నారు. విష్ణువుకి నగలు అంటే చాలా ఇష్టం. పూలతో, తులసి దళాలతో పూజిస్తే ఎంతో సంతోషిస్తాడని చెబుతారు. ఈ రోజున తులసి మాలలు చేసి ఆయనకు మనస్ఫూర్తిగా సమర్పించాలి.ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఘనత లభిస్తుందని చెబుతారు. అది కూడా శుక్రవారమే కావడం వల్ల కామద ఏకాదశి రోజున చేసే పనులు గొప్ప పుణ్యాన్ని ఇస్తాయి.

విష్ణువుతో పాటు దేవతను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజు మనం ఎరుపు రంగు దుస్తులు ధరించి దేవుడిని పూజించాలి. పెళ్లి కానీ వారు పసుపు, కుంకుమలతో లలితాదేవి పారాయణం చేయాలి. విష్ణుమూర్తిని 101 తులసీ దళాలతో పూజిస్తే వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

కొందరైతే కష్టపడి పనిచేసినా, పనిలో ఎలాంటి గుర్తింపు, పదోన్నతులు లభించవు. ఈ సమస్యతో బాధపడేవారు ఈరోజు నల్ల చీమలకు పంచదార వేయాలి. ముఖ్యంగా, వేసవి కాలంలో పేద ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. కుండలు దానం చేయండి. పేదలకు దుస్తులు, మిఠాయిలు పంచాలి.

Advertisement

Next Story

Most Viewed