- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులను ఉంచుతున్నారా.. జాగ్రత్త!
దిశ, ఫీచర్స్: హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచుతుంది. తులసిని పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. అయితే, ఈ మొక్కను ఇంట్లో నాటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వస్తువులు తులసి దగ్గర ఉంటే ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
తులసి దగ్గర శివలింగాన్ని ఉంచవద్దు
తులసి దగ్గర శివలింగాన్ని ఎందుకు పెట్టకూడదు అంటే తులసి మహావిష్ణువును ప్రసన్నం చేసుకుంటుంది. కాబట్టి శివునికి సంబంధించినవి తులసి దగ్గర పెట్టకూడదు.
ఇంటి సామాగ్రి
తులసి మొక్క దగ్గర ఇంటిని శుభ్రపరిచే సామాగ్రిని అసలు ఉంచవద్దు. ముఖ్యంగా చీపురు కట్ట పెట్టకూడదు. ఈ వస్తువులు ఉంచితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
చెప్పులు
తులసి మొక్కల చెప్పులు విడవకూడదు.. వేసుకోకూడదు. తులసి దగ్గర చెప్పులు ఉంచడం వల్ల తులసి తల్లికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది.
మద్యం, సిగిరెట్లు
మనలో చాలా మంది ఉదయం లేవగానే తులసి మొక్కకి పూజలు చేస్తుంటారు. మరి కొందరు తులసి దగ్గర పొగాకు, మద్యం మొదలైనవాటిని తీసుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే విష్ణువు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.