- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గరుడ పురాణం ప్రకారం ఈ తప్పుల వల్ల ఆయుష్షు తగ్గుతుందట.. అవేంటో తెలుసా
దిశ, ఫీచర్స్ : హిందూ మత గ్రంథాలలో అనేక జీవన విధానాలు పేర్కొన్నాయి. వాటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవచ్చు. గరుడ పురాణం హిందూ మతంలోని 18 పురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. గరుడపురాణానికి అధిపతి విష్ణువుగా పరిగణిస్తారు. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలో అనేక సమాచారాలు ఇచ్చారు. మనిషి జీవించడానికి గరుడ పురాణంలో కొన్ని నియమాలు ప్రస్తావించారు. మన జీవితంలో మనం ఎప్పుడూ చేయకూడని విషయాలు కూడా ప్రస్తావించాయి. గరుడ పురాణంలో పేర్కొన్న విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేయకూడని పనులు ఏంటి ?
శ్మశాన వాటిక పొగకు దూరంగా ఉండాలి..
గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికలో కాల్చినప్పుడు, ఆ వ్యక్తి దాని పొగకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మృతదేహం కాలి పోయినప్పుడు పొగతో పాటు విషపూరితమైన బ్యాక్టీరియా కూడా వాతావరణంలోకి వ్యాపిస్తాయి. ఈ విషపూరిత మూలకాలలో అనేక రకాల వైరస్లు ఉన్నాయి. పొగవస్తున్నప్పుడు వ్యక్తి ఊపిరి పీల్చుకుంటే శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి అనారోగ్యానికి గురవుతారు.
తెల్లవారుజాము వరకు నిద్రపోవడం..
గరుడ పురాణం ప్రకారం దీర్ఘాయుష్షు పొందాలనుకుంటే ఉదయం ఆలస్యంగా మేల్కొనే అలవాటును మార్చుకోండి. మత గ్రంథాలలో బ్రహ్మముహూర్తంలో మేల్కొనడం మంచిదని చెబుతున్నారు. ఉదయం వీచే గాలి కూడా స్వచ్ఛమైనదని ఈ గాలి మానవులను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుందని చెబుతున్నాయి.
రాత్రిపూట పెరుగు తినడం..
గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన వస్తువులను ఎప్పుడూ తినకూడదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇది మనిషి జీవితకాలం పై గొప్పప్రభావాన్ని చూపుతుంది. అలాగే రాత్రి మిగిలిపోయిన మాంసాహారాన్ని కూడా తినకూడదు.
నిద్రించడానికి సరైన మార్గం..
దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించడం వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తుందని గరుడ పురాణంలో చెప్పారు. మంచం మీద పడుకున్న తర్వాత గది చీకటిగా ఉండాలని, విరిగిన మంచం పై పడుకోవడం కూడా నిషేధం అని గుర్తుంచుకోవాలి.