‘‘ఎల్జీ పాలిమర్స్‌పై కేసెందుకు పెట్టలేదు’’

by srinivas |
‘‘ఎల్జీ పాలిమర్స్‌పై కేసెందుకు పెట్టలేదు’’
X

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వం తీరు సరిగా లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైన ఎల్జీ కంపెనీపై ఇప్పటి వరకు ఎందుకు కేసులు పెట్టలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘ విశాఖ గ్యాస్ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పర్యావరణ ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘన, వాటర్, ఎయిర్ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు లేవు. మీరంటున్నట్లు మంచి ఎల్జీ కంపెనీలో కనీసం అలారం కూడా మోగదు. సీసీ కెమెరాల పుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదో ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు.’’ అంటూ ఉమ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story