- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి

దిశ, సినిమా: బెజవాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ. ఇప్పుడు వారిద్దరి కథతో తెరకెక్కిన సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. రంగా జీవిత కథ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఇప్పటికే ‘వంగవీటి’ అనే సినిమాను తెరకెక్కించగా.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ఇప్పుడు ఆర్‌టీఆర్ ఫిలింస్ పతాకంపై నర్రా శివనాగు దర్శకత్వంలో జీఎస్‌ఆర్, రాము రాథోడ్ ‘దేవినేని’ టైటిల్‌తో సినిమాను నిర్మిస్తున్నారు.
బెజవాడ సింహం అనే క్యాప్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నందమూరి తారకరత్న దేవినేనిగా టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. సంతోషం పత్రిక అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ కొండేటి వంగవీటి రంగా పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన రంగా ఫస్ట్ లుక్‌లో సురేష్ కొండేటి అదరగొట్టేశారు. కాగా మార్చి 5న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించిన మేకర్స్.. బెజవాడలో ఇద్దరు బలమైన నాయకుల మధ్య జరిగిన యదార్థ సంఘటనలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఈ సినిమాకు చౌదరి మ్యూజిక్ అందించగా, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ కానుంది.