- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొవిడ్ కణాలను తటస్థీకరించే పరికరం
గత నాలుగు నెలల నుంచి కొవిడ్ 19 అతిపెద్ద టాపిక్‌గా మారింది. మానవజీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను నిర్వీర్యం చేయడానికి అటు వైద్యులు, జీవశాస్త్రవేత్తలతో పాటు ఇటువైపు మెకానికల్, థర్మోఫిజికల్ శాస్త్రవేత్తలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే బెంగళూరుకు చెందిన ‘ఆర్గనైజేషన్ దె స్కాలీన్’ అనే సంస్థ ఒక పరికరాన్ని తయారు చేసింది. ఈ పరికరం కొవిడ్ కణాలను తటస్థీకరిస్తుందని వారు చెబుతున్నారు. దీనికి ‘షైకోక్యాన్’ అని పేరు కూడా పెట్టారు. అంటే స్కాలీన్ హైపర్‌ఛార్జ్ కరోనా క్యానన్. ఇప్పటికే ఈ పరికరానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ యూనియన్‌లు ఆమోదముద్ర కూడా వేసినట్లు సమచారం.
షైకోక్యాన్ పరికరం బ్యాక్టీరియాను గానీ, వైరస్‌ను గానీ, ఫంగస్‌ను గానీ చంపదని.. కేవలం కరోనా వైరస్ కణాలను మాత్రమే తటస్థీకరిస్తుందని ఆర్గనైజేషన్ దె స్కాలీన్ చైర్మన్ డాక్టర్ రాజా విజయ్ కుమార్ తెలిపారు. ఈ పరికరం సమర్థతను, రక్షణను ఇప్పటికే పరీక్షించినట్లు, త్వరలోనే అమెరికాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిస్‌క్రీషన్ పాలసీ కింద తయారీ ప్రారంభించబోతున్నట్లు ఆయన చెప్పారు. 10 వేల ఘనపు మీటర్ల ప్రదేశాన్ని ఈ పరికరం కవర్ చేయగలుగుతుంది కాబట్టి ఇళ్లు, ఆఫీసుల్లోనూ, ఇంకా ఇతర వాణిజ్య సముదాయాల్లో ఉపయోగించడానికి వీలుగా ఉంటుందని ఆయన వివరించారు. ఇందులో ఎలాంటి రసాయనాలు గానీ, ఇతర హానికర వాయువులుగానీ ఉపయోగించలేదని విజయ్ కుమార్ అన్నారు.