‘సర్కస్’ ఫీట్ చేయబోతున్న దేవిశ్రీ ప్రసాద్

by Jakkula Samataha |
‘సర్కస్’ ఫీట్ చేయబోతున్న దేవిశ్రీ ప్రసాద్
X

దిశ, సినిమా : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరో బంపర్ ఆఫర్ అందుకున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘రాధే : ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాకు ‘సీటీమార్’ సాంగ్ అందించిన డీఎస్పీ.. ఈ సాంగ్‌తో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్‌కు ఈ సాంగ్ సూపర్ ట్రీట్ ఇవ్వగా.. ఈ సక్సెస్‌తో హిందీలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. డైరెక్టర్ రోహిత్ శెట్టి, హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సర్కస్’ సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడు.

ఈ మూవీకి ఒక్కటి కాదు, రెండు సాంగ్స్ కంపోజ్ చేసే చాన్స్ కొట్టేసిన దేవి.. ఇప్పటికే ఓ పాట పూర్తి చేశాడని, తప్పకుండా చార్ట్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు మేకర్స్. ఇక ఈ రెండు సాంగ్స్‌లో ఒకటి పార్టీ నంబర్ కాగా మరొకటి రొమాంటిక్ ట్రాక్ అని తెలుస్తోంది. నిర్మాత భూషణ్ కుమార్, డైరెక్టర్‌ రోహిత్‌లు.. ఏరి కోరి మరీ దేవిని ఈ సినిమాకు మ్యూజిక్ అందించేందుకు ఎన్నుకున్నారని సమాచారం.

Advertisement

Next Story