పదో తరగతి ఫలితాలపై BIG అప్‌డేట్.. ఆ రోజే రిజల్ట్స్?

by Jakkula Mamatha |
పదో తరగతి ఫలితాలపై BIG అప్‌డేట్.. ఆ రోజే రిజల్ట్స్?
X

దిశ,వెబ్‌డెస్క్: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీ(Andhra Pradesh) పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈనెల 12వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ పదో తరగతి ఫలితాల విడుదల పై కసరత్తు మొదలు పెట్టింది. ఈనెల(ఏప్రిల్) 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే(ఏప్రిల్ 15) పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయింది. విద్యార్ధులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లేదా వాట్సాప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.



Next Story

Most Viewed