- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు’
by Shamantha N |

X
న్యూఢిల్లీ: ఏటా జూన్ చివరివారంలో లేదా జూలై మొదటివారంలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి కూడా అదే సమయానికి జరుగుతాయని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలోనూ షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. అయితే, అప్పటి పరిస్థితులపైనా తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది’అని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎంపీలందరూ పార్టీలకతీతంగా ప్రజలకు సాయం చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. అలాగే, సంక్షోభ సమయంలో మన దేశ నాయకత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని తెలిపారు.
కాగా, గతేడాది జూన్ 20నుంచి ఆగస్టు 7వరకు జరిగిన వర్షాకాల సమావేశాలు.. కరోనా కారణంగా ఈసారి సెప్టెంబర్ చివరివారం వరకు వాయిదా పడొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Next Story