- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా వ్యాప్తి దశపై చర్చిస్తాం: ఢిల్లీ డిప్యూటీ సీఎం
by Shamantha N |

X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి సమూహ దశకు చేరిందా? లేదా? అనే విషయంపై మంగళవారం చర్చిస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అస్వస్థత చేయడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బాధ్యతలు తాను తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య నిపుణులు పాల్గొనబోతున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి సమూహ దశకు చేరిందా? అని వారే చర్చించనున్నట్టు తెలిపారు. ఒకవేళ ఈ దశకు చేరితే, అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరగనున్నట్టు వివరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్వారంటైన్‌లోకి వెళ్లిన తర్వాతి రోజే ఈ సమావేశాన్ని సర్కారు నిర్వహించడం గమనార్హం.
Next Story