- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల హెచ్చరిక
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని చాంబర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తమకు కేటాయించాల్సిన విధులు, నిధులను కేటాయించాలని కోరారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రభుత్వమే వాహనం కేటాయించాలన్నారు. ఇప్పటివరకూ స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదని, ఒకవేళ విడుదల చేస్తే శ్వేతపత్రం విడుదల చేయాలని జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు బెల్లం శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీల సంఘం ప్రెసిడెంట్ శైలజ, భరత్ ప్రసాద్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story