- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్తులో ఆ ఉద్యోగులదే హవా
దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్‌లో ఫ్రీలాన్స్ జాబుల హవా కొనసాగనుంది. యువకులంతా ఈ జాబులకే జై కొట్టే రోజులు ఇప్పటికే వచ్చేశాయి. మరికొద్ది రోజుల్లో అన్ని రంగాల్లో వీటి జోరు మరింత పుంజుకోనుంది. కరోనా యావత్ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగా ఐటీ కంపెనీలతో పాటు పలు రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగులను తొలగించడంతో తిరిగి ఆ రెగ్యులర్ దారిలో వెళ్లేందుకు యువకులు అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులకు పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం వంటి సౌలభ్యాలు కల్పించినా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎక్కువ శాతం యువకులు ఫ్రీలాన్స్ బాట పడుతున్నారు.
కరోనాకు ముందు, కరోనా(జనవరి 2019-జనవరి 2021) తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై ఇండీడ్ జాబ్స్ సంస్థ ఫ్రీలాన్స్ జాబ్ మార్కెట్‌పై పలు విషయాలపై చేపట్టిన సర్వేలో కూడా ఇదే నిజమని తేలింది. 2019తో పోల్చుకుంటే 2021 జనవరి నాటికి ఫ్రీలాన్స్ జాబుల్లో చేరిన వారి సంఖ్య 22 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ దారిలో వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో సర్చ్ చేసే వారి సంఖ్య 73 శాతం పెరిగిందని వెల్లడించింది. కరోనా తరువాత తమ పారిశ్రామిక శక్తిని పునర్నిర్మించుకోవడానికి సంస్థలు కూడా అదే దారిలో వెళ్తున్నాయని, 2020 మే, జూన్‌లో పలు కంపెనీలు ఉద్యోగులను భారీగా నియామకాలు చేసుకున్నాయని స్పష్టం చేసింది. ఇది 2019లో మే, జూన్‌తో పోల్చితే రెండురెట్లు ఎక్కవ అని సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
ఆ ఉద్యోగులకు డిమాండ్
దేశంలో డిజిటలైజేషన్, నైపుణ్యాలు రోజురోజుకూ వేగంగా పెరుగుతుంటే అలాంటి రంగాల్లో ఫ్రీలాన్స్ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన అంశాలపై కూడా సంస్థ అధ్యయనం చేపట్టింది. అందులో క్రియేటివ్, టెక్నికల్, సేల్స్, రిక్రూట్ మెంట్ రంగాలకు డిమాండ్ ఉన్నట్లు పేర్కొంది. అయితే జనవరి 2021 నాటికి ఫ్రీలాన్స్ రైటర్‌కు భారీగా డిమాండ్ ఉండగా, తరువాతి స్థానంలో ఫ్రీలాన్స్ డిజైనర్, రిక్రూటర్, డెవలపర్, డిజిటల్ మార్కెటర్లు ఉన్నారు. బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, పీహెచ్‌పీ డెవలపర్లు కూడా దేశంలోని టాప్-10 ఫ్రీలాన్స్ జాబ్ టైటిల్స్‌లో నిలిచారు.