- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఎగుమతి తర్వాత.. ముందు పౌరులకు టీకా వేయండి : ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : దేశ పౌరులకు ప్రాధాన్యతనిచ్చి ముందు టీకా వేయకుండా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను కేంద్రం ఎగుమతులు చేస్తుండటాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. కరోనాను ఎదుర్కొనే టీకాను దేశ పౌరులు ఇంకా పొందాల్సి ఉండగానే కేంద్ర ప్రభుత్వం వాటిని ఇతర దేశాలకు విక్రయించడం లేదా ఉచితంగా పంపించడం సరికాదని పేర్కొంది. టీకా తీసుకోవడానికి ప్రత్యేక వర్గాలను కేటాయించే ఆవశ్యకతను ప్రశ్నించింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ఫార్మా సంస్థలు మరిన్ని టీకా డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాలను కలిగి ఉన్నాయని, కానీ, వాటి పూర్తి సామర్థ్యాలను ప్రభుత్వం వినియోగించుకోవడం లేదనిపిస్తున్నదని న్యాయమూర్తులు విపిన్ సంఘి, రేఖా పల్లిల ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
‘మనం ఫార్మాసంస్థల పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడం లేదు. అలాగే, మనదేశ ప్రజలకు టీకా వేయకుండా వాటిని ఇతర దేశాలకు అమ్మడం లేదా ఉచితంగా అందజేయడం చేస్తున్నాం. కోర్టు కాంప్లెక్స్‌లో అందుబాటులోని మెడికల్ కేంద్రాలను పరిశీలించాలని, టీకా కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలను తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. న్యాయవ్యవస్థకు సంబంధించిన సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించాలని, తద్వారా వారికి టీకా వేయడం సులువవుతుందన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.