- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులపై టెర్రరిస్ట్ ముద్ర : కేజ్రీవాల్
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: రైతుల ఆందోళనలకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతుల ఉద్యమంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను చైనా, పాకిస్తాన్ ఏజెంట్లు అనడం దారుణం అన్నారు. అంతేగాకుండా హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులపై టెర్రరిస్ట్ మద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కుటుంబాలను రోడ్డున పడేయడం, అవమానించడం అమానుషం అన్నారు. వివాదాస్పద వ్యవసాయన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. రైతులకు మద్దతుగా ఉపవాసం ఉండాలని పార్టీ కార్యకర్తలు, దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరికి వారు తమ ఇళ్ల నుంచే రైతులకు మద్దతు తెలపాలని కోరారు.
Next Story