- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్
by Shamantha N |
X
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం నిర్వహించిన వైద్య పరీక్షలో నెగెటివ్‌గా తేలింది. జ్వరం, గొంతు నొప్పి రావడంతో కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడిందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారు. అప్పటినుంచి ఆయన ఎవరినీ కలవలేదు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ‘కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి ఉండటంతో కేజ్రీవాల్‌కు మంగళవారం కరోనా పరీక్షలు చేశారు. అనంతరం రిపోర్టులో నెగెటివ్‌గా వచ్చింది. ఇది చాలా ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే ఆయనకు మధుమేహం ఉంది’ అని ఆప్ ఎమ్మెల్యే చద్దా తెలిపారు.
Advertisement
Next Story