ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో చేరిన కరోనా

by Shyam |
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో చేరిన కరోనా
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌ (IPL)ను కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో 13 మందికి కరోనా సోకి తర్వాత నెగెటివ్ వచ్చింది. ఈ విషయం మరువక ముందే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఆ జట్టు అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ (Assistant Physiotherapist) కరోనా బారిన పడినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఢిల్లీ జట్టుతో కాకుండా అతడు విడిగా యూఏఈ చేరుకున్నాడు. మొదట జరిపిన రెండు పరీక్షల్లో నెగెటివ్ రాగా, మూడో సారి చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం కరోనా పాజిటివ్‌గా తేలింది.

అయితే అతడు ఇంకా జట్టులో సభ్యులను ఎవరినీ కలవలేదు. ప్రస్తుతం అతడిని క్వారంటైన్‌లో ఉంచినట్లు ఢిల్లీ ప్రకటించింది. కాగా, తమకు కరోనా సోకుతుందని తెలుసు. కానీ దానిని జయించే శక్తి నా శరీరానికి ఉంది అని ఢిల్లీ బ్యాట్స్‌మాన్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆటగాళ్లందరూ బీసీసీఐ (BCCI)నిర్థేశించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారని చెప్పారు. ‘నా శరీరంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కరోనాకు భయపడి ఆడటం మానేయలేను. ప్రస్తుతం క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాను’ అని ధావన్ అన్నాడు.

Advertisement

Next Story