- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సంవత్సరం డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు జూన్ 20 నుంచి మొదలుకానున్నాయి. ఈసారి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షల గడువును మూడు గంటలకు బదులుగా రెండు గంటలే ఉంటుంది. దీనికి తగిన విధంగా పరీక్షల ప్రశ్నాపత్రాల తయారీ ఉంటుంది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతో సంబంధం లేకుండా తరువాతి తరగతులకు ప్రొమోట్ అవుతారు. కళాశాలలు తెరుచుకున్న తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఈ సెమిస్టర్ పరీక్షలతో పాటు బ్యాక్‌లాగ్ పరీక్షలు కూడా నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు, కంట్రోలర్లతో ఇటీవల సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై చర్చించింది. దీని వెలుగులో ఆయా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లు కూడా అనుబంధ కళాశాల డీన్‌లు, ప్రిన్సిపాళ్ళతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్రాలు తదితర అనేక అంశాలపై వివరాలను సేకరించిన ఉన్నత విద్యా మండలి కొన్ని నిర్ణయాలను తీసుకుంది. అయితే అవి సూచనప్రాయమైనవేనని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తించేవని మండలి వ్యాఖ్యానించింది.
అందులో ముఖ్యాంశాలు :
* పరీక్షా సమయాన్ని ప్రస్తుతం ఉన్న మూడు గంటలకు బదులుగా రెండు గంటలు చేయడం; దీనికి అనుగుణంగా ప్రశ్నాపత్రాల నమూనాలో అవసరమైన మార్పులు చేర్పులు చేయడం; ఆయా యూనివర్శిటీలే వారి ఛాయిస్‌కు తగినట్లుగా రూపొందించుకోవాలి.
* డిగ్రీ, పీజీ కోర్సుల ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కోర్సులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలి. కళాశాలలు తిరిగి తెరుచుకున్న తర్వాత లేదా అవకాశాన్నిబట్టి నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలి. ప్రమోట్ చేసేటప్పుడు ఆ విద్యార్థులకు ఎన్ని బ్యాక్‌లాగ్ పరీక్షలు ఉన్నా వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
* బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి సంప్రదాయ కోర్సులకు పరీక్షలను మాత్రం ప్రతీరోజు రెండు సెషన్లలో నిర్వహించవచ్చు. ఆయా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను కళాశాలల నిర్ణయానికే వదిలేయాలి. అసరమైన విధంగా ప్రిన్సిపాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.
* పీహెచ్‌డీ, వైవా లాంటి పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.
* పరీక్షల నిర్వహణ సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.