- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిభట్ల, వెలిమినేడులో డిఫెన్స్ కారిడార్లు : కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ కీలకంగా మారిందని, త్వరలోనే ఆదిభట్ల వెలిమినేడులో ఫ్రెండ్స్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాదులోని తాజ్ హోటల్‌లో 100 ఏహెచ్ 64 అపాచీ ప్యూజలెస్ డెలివరీ సెర్మోని కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలం అని తెలిపారు. డిఫెన్స్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. డీఆర్‌డీవో, బీడీఎల్, ఈసీఐఎల్, బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి ఎన్నో సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందన్నారు.
బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే మెరుగైన వసతులు ఉన్నాయన్నారు. టీ హబ్ ద్వారా అనేక ఇన్నోవేషన్లు రూపొందిస్తున్నట్లు తెలిపారు. డిఫెన్స్ సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లో కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని పరిశ్రమలు కరోనా కాలంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్పత్తిని ప్రారంభించాయని, హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ ఇండస్ట్రీస్ ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఎఎస్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్ సింగ్, మాల్యా అగర్వాల్, కృష్ణ, విజయ్ సింగ్, సుక్క రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.