- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కపిల్’లో రణ్‌దీప్ కపుల్
మాజీ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ కెప్టెన్ కపిల్‌దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ’83’. హర్యానా హరికేన్ కపిల్‌దేవ్ జీవిత ప్రయాణాన్ని ఈ సినిమా ద్వారా తెరపై ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. భారత క్రికెట్ కెప్టెన్‌గా కపిల్ ఎదిగిన విధానం.. 1983లో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఉద్వేగభరిత ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నారు. సినిమాలో ‘కపిల్‌దేవ్’గా రణ్‌వీర్‌సింగ్‌గా ఆయన సతీమణి ‘రోమీ భాటియా’గా దీపికా పడుకోన్ నటిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా… సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. దీప్ వీర్ జంట.. కపిల్, రోమీగా అదిరిపోయారని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. రియల్ లైఫ్ దంపతులైన రణ్‌వీర్, దీపికా .. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ రీల్ లైఫ్‌లోనూ కపుల్‌గా కనిపిస్తున్నఈ చిత్రం దీపికాకు చాలా స్పెషల్. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది దీపికా. క్రీడా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షణాలకు వేదికగా నిలిచే ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషించడం సంపూర్ణ గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపింది. తన కన్నా తన భర్త కలలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ కలలను సాకారం చేసే దిశగా భర్తకు పూర్తి మద్ధతునిచ్చే ప్రతీ స్త్రీకి ఈ సినిమా అంకితం అని పోస్ట్ పెట్టింది.