ప్రపంచం ముందు పర్సనాలిటీ బయటపెట్టిన దీపిక

by Jakkula Samataha |   ( Updated:2023-03-30 17:31:02.0  )
ప్రపంచం ముందు పర్సనాలిటీ బయటపెట్టిన దీపిక
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే న్యూ వెబ్‌సైట్ లాంచ్ చేసింది. www.deepikapadukone.com పేరుతో ప్రారంభించిన వెబ్‌సైట్‌ ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు తన కెరియర్ విషయాలపై అప్‌డేట్ ఇవ్వనుంది. వెబ్‌సైట్ ఎబౌట్‌ సెక్షన్‌లో బయోగ్రఫీ, ఫిల్మోగ్రఫీ, అవార్డ్స్, కవర్స్, బ్రాండ్ అసోసియేషన్స్ గురించి తెలిపిన దీపిక.. టీవీ సెక్షన్‌లో ఇంటర్వ్యూల గురించి వివరించింది. గ్యాలరీలో లేటెస్ట్ ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తుండగా.. లేటెస్ట్ సెక్షన్‌లో సినిమాలు, మ్యాగజైన్ కవర్ పేజీలకు సంబంధించిన వార్తలకు సంబంధించిన న్యూస్ అందించనుంది. స్ట్రెస్, డిప్రెషన్‌ నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతో ప్రారంభించిన ‘లివ్ లవ్ లాఫ్’ సెక్షన్‌‌లో థెరపిస్ట్, హెల్ప్ లైన్, హోప్‌ఫుల్ స్టోరీస్‌ను అందుబాటులో ఉంచింది. తన డ్రెస్సింగ్ గురించి తెలుసుకోవాలనుకున్న అభిమానుల కోసం ‘క్లోజెట్‌’ పేరుతో మరో సెక్షన్ యాడ్ చేసింది. ఫైనల్‌గా ఈ వెబ్‌సైట్ తన పర్సనాలిటీ ఎక్స్‌టెన్షన్‌ అన్న దీపిక.. తన విజన్‌కు డీపర్ లుక్‌గా వివరించింది.

Advertisement

Next Story