- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేకేఆర్ కొంపముంచిన బౌలర్.. పోరాడుతున్న రస్సెల్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మాన్‌లకు ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. సీఎస్కే ఫేస్ బౌలర్ దీపక్ చాహర్ కేకేఆర్ బ్యాట్స్‌మాన్‌లకు చుక్కలు చూపించాడు. తొలుత శుభ్‌మన్ గిల్‌ను డకౌట్ చేసిన చాహర్.. ఆ తర్వాత నితీష్ రానాను (9) పరుగులకే పెవిలియన్ పంపాడు. ఇదే ఉత్సాహంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7) , ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌కు కూడా (4) పరుగుల వద్దనే క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో 31 పరుగులకే కేకేఆర్ 4 కీలక వికెట్లు వదులుకుంది. ఈ నాలుగు వికెట్లను కూడా దీపక్ చాహర్ తీసుకోవడం గమనార్హం. ఇతడికి తోడు లుంగి ఎంగిడి కూడా రాహుల్ త్రిపాఠి వికెట్‌ను తీసుకోగా.. 5 వికెట్ల నష్టానికి కేకేఆర్ స్కోరు 31గా ఉంది. ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్(17) , రస్సెల్(47) ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. తొలి 10 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 97-5. ముఖ్యంగా ఆండ్రూ రస్సెల్ 17 బంతుల్లో 47 పరుగులతో తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.