కొవిడ్ పేషెంట్ మృతి.. డాక్టర్‌ను చితకొట్టిన బంధువులు

by Anukaran |   ( Updated:2021-06-02 00:35:41.0  )
కొవిడ్ పేషెంట్ మృతి.. డాక్టర్‌ను చితకొట్టిన బంధువులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో ప్రాణాలు అడ్డుపెట్టి డాక్టర్లు సేవ చేస్తున్నారు. ఇటువంటి డాక్టర్లపై పలువురు దాడులకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇటువంటి మరో ఘటన మంగళవారం అస్సాంలో వెలుగుచూసింది. హోజాయ్ జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్‌లో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, మృతుడి చావుకి కారణం డాక్టర్లే అంటూ ఆవేశానికి లోనైన పేషెంట్ బంధువులు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్‌పై దాడి చేశాడు. స్టీల్ ప్లేట్‌తో కొట్టడమే కాకుండా, కాళ్లతో విచక్షణ రహితంగా తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇదే వ్యవహారంపై అస్సాం సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లపై దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed