ఎన్నికల వేళ టీఎంసీకి మరో షాక్

by Shamantha N |   ( Updated:2021-03-15 04:35:04.0  )
ఎన్నికల వేళ టీఎంసీకి మరో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతలు జంపింగ్‌లు మరింత ఎక్కువైపోయాయి. ఎన్నికల క్రమంలో ఒక పార్టీ నుంచి మరొ పార్టీలోకి జంప్ అయ్యేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వరుసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా టీఎంసీకి మరో షాక్ తగలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటి దేబశ్రీ రాయ్ టీఎంసీని వీడారు. పదేళ్లుగా రాయ్ దిఘి నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. అయితే త్వరలో ఆమె బీజేపీలో చేరే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed