న్యూయార్క్‌లో కరోనా కల్లోలం

by vinod kumar |
న్యూయార్క్‌లో కరోనా కల్లోలం
X

కరోనా రక్కసి ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. మరీ ముఖ్యంగా న్యూయార్క్ సిటీపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి ఆసుపత్రుల్లో కరోనా బాధితులతో, రోగుల మరణాలతో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో దాదాపు 2,400 మంది మృత్యువాత పడ్డారు. న్యూయార్క్‌లోని ఏ ఆసుపత్రి చూసిన కాషాయ సంచుల్లో ఉంచిన శవాలే దర్శనమిస్తున్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో మార్చురీలు హౌస్ పుల్ అయ్యాయి. దీంతో మొబైల్ మార్చురీలను సిద్ధం చేస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి సరైన సౌకర్యాలు లేక దినదినగండంగా గడుపుతున్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల పైచిలుకు కేసులు నమోదు అవ్వగా, 10 వేల మంది చనిపోయారు.

Tags: carona, usa, newyarok, death count raise

Advertisement

Next Story