- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతదేహం తరలింపు ఇలాగేనా ..?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ఎన్నో దారుణ సంఘటనలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఎన్నో అమానుషాలకు ఆయువు పోస్తోంది. మనిషి ప్రాణంతో పాటు మానవ సబంధాలను దెబ్బతీస్తోంది. ఇప్పటికే మృతదేహాల పట్ల వివక్షతో జేసీబీలో తరలించి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంబులెన్స్‌లో కాకుండా ఆటోలో తరలించడం జిల్లాలో కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే సమయానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో.. బంధువులు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా(పీపీఈ కిట్లు) మృత దేహాన్ని ఆటోలో తరలించారు. ఈ సమయంలో వైద్యులు కూడా చూసి చూడనట్టు ఉన్నారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. చేసేదేమీ లేక ఇలా ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లామని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఇలా మృతదేహాలను బాధ్యతారహితంగా తీసుకెళ్తే మిగతా వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.