- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్రిక్తత.. అధికారులను నిలదీసిన దళితులు
దిశ, డోర్నకల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలోని భూమిలేని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో దళితులకు గతంలో కేటాయించిన అసైన్మెంట్ భూములను తిరిగి లాక్కోని పేదల పొట్టలు కొట్టాలని చూస్తోంది. 40ఏళ్ళ క్రితం అప్పటి ప్రభుత్వం పేదలుగా గుర్తించి బలహీన వర్గాలకు భూములను పంచి ఇచ్చింది. అప్పటి నుంచి వారే కబ్జా దారులుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కోసం భూములను సేకరిస్తోంది. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూములను ప్రభుత్వ భూములంటూ చెట్లు నాటేందుకు పూనుకుంది. దీంతో సదరు రైతులు భూములు లాక్కోవద్దంటటూ అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.
మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామ శివారులో 444 సర్వే నెంబర్లో 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 30 మంది నిరుపేద దళితులకు పట్టాలు పంపిణీ చేసింది. అదేవిదంగా 1993 సంవత్సరంలో ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మరో 40 మందికి 10 గుంటలు, 20 గుంటల భూమికి పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 70 మందికి 18 ఎకరాల భూమి ప్రభుత్వం పంపిణీ చేసింది. 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటూ దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ మధ్యనే కొంతమంది రైతులకు ధరణి పాస్ పుస్తకాలు కూడా వచ్చినట్లు సదరు రైతులు తెలిపారు. అయితే గ్రామంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో దళితులకు కేటాయించిన భూమిని బలవంతంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మండల సర్వేయర్ సమక్షంలో జేసీబీ సహాయంతో గ్రామ అభివృద్ధి పనుల కోసం చదును చేసి హద్దులు నిర్ధారించడానికి ప్ యత్నిస్తున్న క్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తప్పెట్ల, శ్రీనివాస్ ఆధ్వర్యంలో దళిత రైతులు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నారు. తమ భూములు తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
కురవి మండలం తిర్మలాపురంలో ఉద్రిక్తత
దళితుల భూములలో మొక్కలు పెట్టడానికి వచ్చిన రెవిన్యూ అధికారులును తమ భూమిని ప్రభుత్వం గుంజుకోవద్దని, 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో దళితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.