- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెల్లారితే నిమజ్జనం.. అర్ధరాత్రి ఆలయంలో దళితులపై దారుణం
దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట అక్బర్ నగర్ గ్రామానికి చెందిన యువకులు ధర్నా నిర్వహించారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో శనివారం రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా రుద్రూర్ ఫామ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన దళితుల గణేష్ నిమజ్జన కార్యక్రమంలో యువకులపై కొంతమంది దాడి చేశారు.
తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని, దీంతో నిరాశకు గురైన దళిత యువకులంతా పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమపై ఇతర కులస్తులు అకారణంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాని, తమ ఫిర్యాదు స్వీకరించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇతర కులస్తులకు వత్తాసు పలకకుండా దళితులైన తమకు న్యాయం చేయాలని స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీందర్ బందోబస్తు నుండి పీఎస్‌కు వచ్చి దళితులు అందరినీ శాంతింపజేసి వారి ఫిర్యాదును స్వీకరించారు.
నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి ఇతర కులస్తులు దళితులపై దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.