న్యాయం చేయాలంటూ దళిత మహిళ ఆందోళన

by Shyam |
న్యాయం చేయాలంటూ దళిత మహిళ ఆందోళన
X

దిశ, ముషీరాబాద్:
తనకు న్యాయం చేయాలని కోరుతూ అంబర్ పేట అలీఖేఫ్ న్యూ అంబేద్కర్ నగర్ కు చెందిన దళిత మహిళ జగదీశ్వరి కిరోసిన్ డబ్బా పట్టుకుని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన తల్లి కష్టపడి సంపాదించిన ఇంటిని ఇతరులకు అమ్మేందుకు టీఆర్ఎస్ నాయకుడు ఆయిల్ అంజయ్య ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అంజయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అంజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని ఆమె తెలిపారు. అతనికే సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకుంటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed