- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP ఓటర్లను బెదిరించి గెలుపొందాలని చూస్తోంది : పురంధేశ్వరి
దిశ, ఏపీ బ్యూరో : వైసీపీకి ఓటు వేస్తే అరాచకాలను ప్రోత్సహించినట్లే అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కమ్మవారి పాలెంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దగ్గుబాటి పురంధేశ్వరి అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సైతం ఈ ప్రభుత్వం దారి మళ్ళించిందని ఆరోపించారు. పులివెందుల అభివృద్ధి బద్వేలులో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, అక్రమాలే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తుందని ధ్వజమెత్తారు. ఎంత మందిని బెదిరింపులకు గురి చేసి లోబర్చుకున్నా అదిరేది లేదు.. బెదిరేది లేదని చెప్పుకొచ్చారు.
అవీనీతికి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. పొరుగు జిల్లా వాసులకు సాగు నీరు, తాగు నీటిని త్యాగం చేసిన బద్వేలు ప్రాంత వాసులు తాజాగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కనపడటంలేదా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరుగుతాయని.. బద్వేలు ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. బద్వేలులో అభివృద్ధి జరగాలంటే వైసీపీ అభ్యర్థి డా.సుధను ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు.