- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హాయ్ బాగున్నారా.. యోగక్షేమాలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు
దిశ ప్రతినిధి, ఖమ్మం: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఇతరుల డబ్బు దోచేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టించి ఖాతాలోని డబ్బు కాజేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వారికి సంబంధించిన కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాదు.. అచ్చం మనం చేసినట్లే అవతలి వారితో చాట్ చేసి డబ్బు అడుగుతున్నారు.. అంతేకాదు తర్వాత ఏం చేయాలో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు.. వీరు చెప్పినట్లు చేస్తే ఇక అంతే.. అకౌంట్‌లోని డబ్బంతా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది.
మొదట చాటింగ్‌తో మొదలు పెట్టి..
సైబర్ నేరగాళ్లు మొదట సోషల్ మీడియా అకౌంట్లను హ్యా్క్ చేసి వారి కాంటాక్ట్ వివరాలు సేకరిస్తున్నారు. అంతరం తెలిసిన వారి నంబర్ నుంచే మొదట చాట్ చేస్తారు. ఎలాగంటే అచ్చం మన మిత్రులు చేసినట్టే. ‘ హాయ్.. బాగున్నారా..’ అంటూ మొదలైన చాటింగ్ యోగక్షేమాలు మొత్తం అడుగుతారు. వెంటనే అవసరం ఉందంటూ కొంత డబ్బు (తక్కువ మొత్తంలో) అడుగుతున్నారు. మన కాంటాక్ట్ లోని నంబరే కాబట్టి మనకు తెలిసిన వ్యక్తే డబ్బు అడుగుతున్నాడని గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పంపిస్తే.. ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం డబ్బు పంపిననట్లు చూపించే వివరాలను స్క్రీన్ షాట్ ద్వారా పంపించాలని వినయంగా కోరుతారు. సరే అని పంపిస్తే ట్రాన్ జాక్షన్ కు సంబంధించి ఐడీ నంబర్ తో ఆ అకౌంట్ లో గల డబ్బంతా విడతల వారీగా ఖాళీ చేయవచ్చని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఇలా పలు జిల్లాల్లోని ప్రముఖులు, జర్నలిస్టుల సోషల్ మీడియా అకౌంట్లు ఇటీవల హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
కొత్త ఎత్తుగడలతో ముందుకు..
ఇలానే కొంత మందికి తెలిసిన నెంబర్ నుంచే మొదట మెసేజ్లు వచ్చి తర్వాత డబ్బు అడగడం మొదలు పెట్టారు నేరగాళ్లు. అయితే కొంతమంది ముందే పసిగట్టగా మరికొంతమంది వారి వలలో చిక్కినట్లు సమాచారం. వారు అడిగిన డబ్బు పంపి తర్వాత అసలు విషయం తెలిసి ఆందోళన చెందారు. ఇలా ఒకరి నెంబర్ నుంచి మరొకరికి డబ్బులు పంపించమని మెసేజ్ లు పెడుతున్నారు. అంతేకాదు ఫ్రెండ్ రిక్వెస్టెలు పంపుతూ అసభ్యకర చాటింగ్ సైతం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై కొంతమంది పోలీసులను సైతం ఆశ్రయించారు. సైబర్ నేరగాళ్లు ఊహించని విధంగా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారని.. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వారి ఇచ్చే ఇన్ స్ట్రక్షన్స్ ను పాటించొద్దని పోలీసులు సూచిస్తున్నారు.