- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ టైంలో వాహనాలపై ప్రయాణాలు వద్దు
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పొగమంచు కురుస్తున్న కారణంగా కొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రయాణీకులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారు జామున రోడ్డు స్పష్టంగా కనిపించదు కాబట్టి సూర్యోదయం అయ్యాక వాహనాలపై ప్రయాణం చేస్తే మంచిదని చెబుతున్నారు. పొగ మంచులో హై బీమ్ లైట్ల బదులు లోబీమ్ హెడ్ లైట్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. విండ్ షీల్డ్ పై ఏర్పడే తేమను ఎప్పటికప్పుడు వైపర్, డీ ఫ్రాస్టర్‌లను ఉపయోగించి తొలగించుకోవాలని అంటున్నారు. తగిన వేగంతో ప్రయాణించాలని, ఇతర వాహనాల నుంచి తగిన దూరం పాటించాలని చెబుతున్నారు. బ్రేక్ వేసే ముందు రియర్ వ్యూ అద్దాలను గమనించాలని సూచిస్తున్నారు.
Next Story