- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మౌలిక వనరులపై సైబరాబాద్ సీపీ ఆడిటింగ్..
దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, డీసీపీలతో ఆడిటింగ్ సమావేశాన్ని నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లలో మౌలిక వసతులు, మ్యాన్ పవర్, పరికరాలు తదితర విషయాలపై ఆడిటింగ్ చేశారు. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మ్యాన్ పవర్, పరికరాలను తగిన రీతిలో ఎలా వినియోగించుకోవాలో సూచించారు. రానున్న రోజుల్లో జరగనున్న జనాభివృద్ధి, పట్టణీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అందుకనుంగుణంగా వనరులను పెంచుకోవాలన్నారు.
ఏయే ప్రదేశాల్లో ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయో గుర్తించి అందుకనుగుణంగా సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్, శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి, క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, డీసీపీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.