కస్టమర్‌కు షాకిచ్చిన ‘అమెజాన్’.. నష్టపరిహారం ఇవ్వాల్సిందే?

by Shamantha N |
కస్టమర్‌కు షాకిచ్చిన ‘అమెజాన్’.. నష్టపరిహారం ఇవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ కామర్స్ వ్యాపారం విస్తరించాక ఈ రోజుల్లో చాలా మంది నేరుగా షాపులకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడమే తగ్గించారు. కొందరు మాత్రమే దగ్గరలోని షోరూమ్స్‌కు వెళ్లి తమకు నచ్చిన వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేస్తున్నారు. బయటకు వెళ్లే ఓపిక, టైం లేని వారు మాత్రం మొబైల్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. అందుకోసం ఈ కామర్స్ సంస్థలపై ఆధారపడుతున్నారు. ఇండియాలో చాలా మంది కస్టమర్స్ ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలపై ఆధారపడుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఈ రెండు ఆన్లైన్ సంస్థలపై కస్టమర్ల ఫిర్యాదులు పెరిగిపోయాయి. కారణం తాము కొనుగోలు చేసిన వస్తువులు కాకుండా వేరే వాటిని డెలివరీ చేయడమే..

తాజాగా ఇటువంటి ఘటనే మరొకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో వెలుగుచూసింది. ఓ వినియోగదారుడు అమెజాన్‌లో రూ.7499 విలువ గల గీజర్ బుక్ చేశాడు. కానీ తనకు వచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి చూడగా అందులో ‘మ్యాగీ ప్యాకెట్స్ అండ్ ఈజీ లిక్విడ్ డిటర్జంట్’ వచ్చింది. ఈ విషయాన్ని అమెజాన్ సర్వీస్ విభాగం దృష్టికి తీసుకెళ్లగా.. డబ్బులు రీఫండ్ చేస్తామని డెలీవరి బాయ్ తెలిపాడు. అయితే, కనీసం వారు క్షమాపణ కూడా కోరలేదని కస్టమర్ తెగ ఫీలయిపోయాడు. తనకు రీఫండ్ అవసరం అవసరం లేదని నష్టపరిహారం అందించాలని బాధిత కస్టమర్ డిమాండ్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా వైరల్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed