- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్‌సీ.. )
చైనా రక్షణ మంత్రిగా లీ షెంగ్‌ఫూ నియామకం:
చైనా నూతన రక్షణ మంత్రిగా లీ షెంగ్ ఫూను చైనా నియమించింది. సైన్యంలో జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న లీ పై 2018లో అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి సుఖోయ్ ఎస్‌యూ - 35, ఎస్ - 400లు దిగుమతి చేసుకున్నందుకు ఈ చర్యలు తీసుకుంది. ఏరోస్పేస్ ఇంజనీరైన లీ షెంగ్ ఫూ, రష్యా అనుకూలుడన్న పేరు ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సాయంగా చైనా ఆయుధాలను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని నాటో కూటమి హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం గమనార్హం.
చైనా ప్రధానిగా లీ చియాంగ్:
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్ (63) ఆ దేశ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. గత పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్(67) స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు చియాంగ్ పేరును అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రతిపాదించగా చైనా పార్లమెంటు సభ్యులు 2,952 మందిలో సమావేశానికి 2,947 మంది హాజరయ్యారు. 8 మంది ఓటింగ్ కు దూరంగా ఉండగా..ముగ్గురు సభ్యులు మాత్రమే చియాంగ్‌కు వ్యతిరేకంగా మిగిలిన 2,936 మంది అనుకూలంగా ఓటు వేశారు.
తెలంగాణకు మరో రెండు కేంద్ర పురస్కారాలు:
దేశంలోనే వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడిఎఫ్) ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఫలితాల్లో రాష్ట్రం ఈ ఘనత సాధించింది. ఈ మేరకు ఓడీఎఫ్ ప్లస్, స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు రాష్ట్రానికి రెండు పురస్కారాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినట్లు ప్రకటించారు.
95వ ఆస్కార్ అవార్డులు:
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ గెలిచింది. ఈ విభాగంలో భారతీయ పాటకు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి. దీనికి ఎస్ ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించగా ..ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచించిన నాటు నాటు..పాట అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్.
భారతీయ డాక్యుమెంటరీకి తొలి అవార్డు:
అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా వేదికపై అవార్డు తీసుకున్నారు. కార్తికి దర్శకురాలిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ దక్కడం ఇదే తొలిసారి.
ఉత్తమ చిత్రంగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’:
చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఓ కుటుంబం కథతో తెరకెక్కిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 11 నామినేషన్లు గెలుచుకుంది. ఏకంగా ఏడు అవార్డులను కైవసం చేసుకుంది.
డానియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు. అమెరికన్ చలన చిత్ర దర్శకులైన్ వీరిని డేనియల్స్ అని పిలుస్తారు. ఈ చిత్రంలో లాండ్రీ షాప్ యజమానిగా నటించిన మిషెల్ యో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ పురస్కారం అందుకున్న ఆసియా సంతతికి చెందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఉత్తమ సహాయనటి, సహాయ నటుడు, స్క్రీన్ ప్లే, ఎడిటర్ విభాగాల్లోనూ ఈ చిత్రం పురస్కారాలు గెలుచుకుంది. ది వేల్ చిత్రంతో బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
నటుడు: ట్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
నటి: మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
సహాయ నటుడు: కె హుయ్ ఖ్యాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
సహాయ నటి: జేమీలీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
దర్శకుడు: డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఒరిజినల్ సాంగ్: నాటు నాటు.. (ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్)
ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
మేకప్: ఆడ్రియన్ మోరోట్ (ది వేల్)
దుస్తుల రూపకల్పన: రుత్ ఇ కార్టర్ (బ్లాక్ పాంథర్: వాకండా ఫరెవర్)
సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
స్క్రీన్ ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : వుమెన్ టాకింగ్, సౌండ్ : టాప్ గన్- మావెరిక్
ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ప్రోడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
విజువల్ ఎఫెక్ట్స్: అవతార్, దివే ఆఫ్ వాటర్
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
డాక్యుమెంటరీ ఫీచర్: నవల్నీ,
డాక్యుమెంటరీ షార్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్
యానిమేటెడ్ షార్ట్: ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్.