- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరెంట్ అఫైర్స్: 27-12-2022
దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా:
యూపీకి చెందిన సానియా మీర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్ ఫైలట్‌గా చరిత్ర సృష్టించనున్నారు.
సానియాది మీర్జాపూర్ లోని ఓ కుగ్రామం.
తొలి మహిళా ఫైటర్ పైలట్ అవని చతుర్వేది ఆమెకు ఆదర్శం.
వైద్య సమాజానికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి:
కరోనా వైరస్ సోకిన, కోట్ల మంది ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, అవిశ్రాంతంగా విశేష సేవలందించారు.
కొవిడ్ యోధులుగా నిలిచిన భారతీయ వైద్య సమాజానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి -2022 అవార్డు దక్కింది.
ఏపీకి 3 ఎనర్టియా అవార్డులు:
ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ సంస్థలకు మూడు ఎనర్టియా అవార్డులు దక్కాయని ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీలో నిర్వహించిన 15వ ఎనర్టియా సమ్మిట్ లో రాష్ట్రం తరఫున ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్ కో వీసీఎండీ బి.శ్రీధర్ అవార్డులను అందుకున్నారు.
మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు:
ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.
మరో రచయిత, కవి వారాల ఆనంద్‌కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది.
దక్షిణ భారతదేశంలో వందేళ్లకు పూర్వం ఉన్న దేవదాసీల వ్యవస్థ, ఆ వ్యవస్థ పెరుగుదల, క్షీణత, దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేషణాత్మకంగా నరేంద్ర రాసిన మనోధర్మ పరాగం నవల 2022 ఏడాదికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది.
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి, పీటీ ఉష:
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పురస్కరించుకొని తొలుత డిసెంబర్ 5న ప్రకటించిన జాబితాలో ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు.
రాజ్యసభకు ఇటీవల నామినేట్ అయిన మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ను ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు.
ఒక నామినేటెడ్ సభ్యురాలిని ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించడం ఇదే తొలిసారి.
నేవీలోకి ఐఎన్ఎస్ మోర్మగావ్ యుద్ధనౌక ప్రవేశం:
భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింతగా పెరిగాయి.
దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారు.
ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ లో తయారైన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఇదీ ఒకటిగా అభివర్ణించారు.
ఐఎన్ఎస్ మోర్ముగావ్ ప్రొఫైల్:
ఐఎన్ఎస్ మోర్మగావ్ పొడవు - 163 మీ. వెడల్పు 17 మీ. బరువు 7400 టన్నులు.
గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట దీనికి నామకరణం చేశారు.
అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు.
దీనిని ముంబయిలోని మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించింది.
ఈ యుధ్దనౌక గంటకు 30 నాట్‌ల పైగా వేగాన్ని అందుకోగలదు.
ఇది ఉపరితలం నుంచి ఉపరితలంలోకి, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులు ప్రయోగిస్తుంది.
నేపాల్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా ప్రధాని దేవ్‌బా:
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా.. అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికయ్యారు.
5వ సారి ప్రధానిగా సేవలందిస్తున్న 76 ఏళ్ల షేర్ బహదూర్, తన ప్రత్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి గగన్ కుమార్ థాపే పై 39 ఓట్ల ఆధిక్యంతో పార్లమెంటరీ నేతగా ఎంపికయ్యారు.
ఇటీవల జరిగిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలకు యునెస్కో గుర్తింపు:
భారత్ లో మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టేటివ్) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రకటించింది.
గుజరాత్‌కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మొఢేరా సూర్యదేవాలయం, చారిత్రక నగరం వడ్ నగర్, ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటి రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది.
ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.