- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను కట్టగలను.. కానీ సామాన్యుల పరిస్థితేంటి’
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ బంద్ చేసిన సినిమా ఇండస్ర్టీకి చెందిన అందరూ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కాలంలో ఎవరూ ఖాళీగా ఉండకుండా ఏందో వర్క్ చేసుకోవడం.. ఏదైనా కొత్త పని నేర్చుకోవడం వంటివి చేశారు. థియోటర్లు బంద్ కావడంతో.. అభిమానులను అలరించడానికి అందరూ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉన్నారు. ఇదిలా ఉండగా నటి స్నేహ మాత్రం ఈ లాక్‌డౌన్ కాలంలో ఒక వింత ఘటనను చవిచూడాల్సి వచ్చింది. లాక్‌డౌన్ కాలంలో ఆమె ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా రూ.70వేలు దాటింది. ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రసన్న ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా విద్యుత్ అధికారులపై ఆరోపణలు చేశారు. తమిళనాడు విద్యుత్ సంస్థ దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. ‘నేను రూ. 70 వేలు కట్టగలను.. కానీ సామాన్యుల పరిస్థితి’ ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, తాను ఎప్పుడూ కరెంట్ బిల్ విషయంలో ఆలస్యం చేయలేదని, బిల్ వచ్చిన 10 రోజుల్లోపు చెల్లించేవాడినని తెలిపారు. బిల్లు లేకపోవడం వల్లే రెండు నెలలుగా బిల్ చెల్లించలేదని తెలిపారు. ఇంత కరెంట్ బిల్ అసలు ఇప్పటివరకూ మాకు ఎప్పుడు రాలేదని ఆయన ట్విట్టర్ వేదికగా తమిళనాడు విద్యుత్ బోర్డు అక్రమాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు.