వామ్మో.. మొబైల్ రిపేరింగ్ షాప్‌కు ఇంత కరెంటు బిల్లా..

by Shyam |
వామ్మో.. మొబైల్ రిపేరింగ్ షాప్‌కు ఇంత కరెంటు బిల్లా..
X

దిశ, జడ్చర్ల : ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లు సర్వ సాధారణమే. కానీ, ఓ వ్యక్తి తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల‌లో ఓ వ్యక్తికి ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూసి షాక్ అయిన అతను అధికారులను అడిగితే సంబంధిత అధికారులు ముందు రీడింగ్ చూసుకో అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్టు బాధితుడు తెలిపారు. పట్టణంలో కె.వి మొబైల్ రిపేరింగ్ షాప్ నడుపుతున్న వెంకటాచారి అనే నిర్వాహకుడు తన షాపులో కేవలం ఒక ఫ్యాన్, ఒక లైటు మాత్రమే వినియోగించడంతో ప్రతి నెల రెండు 200 నుంచి 400 వందల రూపాయల దాకా మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుండేది.

కానీ, ఈ నెల ఏకంగా 7,29 ,442 రూపాయలు విద్యుత్ బిల్లు రావడంతో వినియోగదారుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇదేంటని విద్యుత్ అధికారులను నిలదీయడంతో మీటర్ రీడింగ్ అంతే ఉందని తాము కూడా ఉన్న బిల్లు మాత్రమే ఇచ్చామని వినియోగదారుడికి తెలపడంతో చేసేది ఏమీ లేక వినియోగదారుడు మీడియాను ఆశ్రయించాడు. ప్రతినెల వందల్లో వచ్చే విద్యుత్ బిల్లు ప్రస్తుతం లక్షల్లో రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని సామాన్య కుటుంబానికి చెందిన తమకు లక్షల్లో బిల్లులు ఎలా చెల్లించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed