- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం
కరోనా విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన సహర్స పట్టణంలో చోటుచేసుకుంది. అసలే వైరస్ ధాటికి ప్రజలు గడప దాటి బయటకు రావడం లేదు. పట్టణంలో కొంత మంది అగంతకులు ఇళ్ల ముందు రూ.10, రూ.50, రూ.100 నోట్లను ఉంచారు. వీటితో పాటు ఓ కాగితాన్ని కూడా వదిలి వెళ్తున్నారు. అందులో ‘‘ నేను కరోనాతో వచ్చాను. ఈ నోట్లను తీసుకోండి. లేకపోతే అందరినీ వేధిస్తాను ’’ అని కాగితంలో రాసి ఉంది. చీటిలో రాతను బట్టి ఇద్దంతా కావాలనే ఒకరు మాత్రమే చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నట్లు ఓ వ్యక్తి వెల్లడించాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బీహార్ పోలీసులు తెలిపారు. కాగా, కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయంగా ఇప్పటి వరకు ఎలాంటి రుజువు కాలేదు.
Tags: currency notes, bihar, sahasra town, houses