India Vs South Africa.. టెస్టు, వన్డే సిరీస్ కొత్త షెడ్యూల్ రిలీజ్

by Anukaran |
India Vs South Africa.. టెస్టు, వన్డే సిరీస్ కొత్త షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్, దక్షిణాఫ్రికా మధ్య త్వరలో జరుగనున్న టెస్టు, వన్డే సిరీస్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. క్రికెట్ సౌత్​ఆఫ్రికా (సీఎస్ఏ).. మూడు టెస్టులు, మూడు వన్డేలకు కొత్త తేదీలను ఖరారు చేసింది. బీసీసీఐతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ఏ బోర్డు పేర్కొంది.

అయితే, ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉండగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టీ20 సిరీస్‌ను వాయిదా వేశారు.
సవరించిన కొత్త షెడ్యూల్ ప్రకారం..

టెస్టు సిరీస్..

– తొలి టెస్టు- డిసెంబరు 26-30.
– రెండో టెస్టు – జనవరి 3-7.
– మూడో టెస్టు – జనవరి 11-15.

వన్డే సిరీస్​..

– మొదటి వన్డే – జనవరి 19.
– రెండో వన్డే – జనవరి 21.
-మూడో వన్డే – జనవరి 23.

Advertisement

Next Story

Most Viewed