ప్రగతి పనులపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

by Aamani |
ప్రగతి పనులపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, ఆదిలాబాద్: రైతు వేదికల నిర్మాణాలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, రైతుబంధు వంటి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని, పరిపాలన అనుమతులు, మెటీరియల్ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో గోదాంలను నిర్మించే విధంగా స్థలాలను గుర్తించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని తెలియజేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు,సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్‌ల కొనుగోలు వాయిదాలు చెల్లించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ మాట్లాడుతూ.. జిల్లాలో పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 79 రైతు వేదికల నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Advertisement

Next Story